Pragathi: నేను చాలా అదృష్టవంతురాలిని.. ఆశీర్వాదాలు అందాయి..నటి ప్రగతి వీడియో వైరల్!

Pragathi: నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ప్రగతి అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో తల్లి పాత్రలు పోషించి ఆమె ప్రత్యేక గుర్తింపును పొందింది. అగ్ర హీరోలతో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్న ఈమె, కరోనా పుణ్యమా అని మరికొందరికి పరిచయమైంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. లాక్‌డౌన్ కారణంగా అన్ని పనులూ ఆగిపోయి, ఇంటివద్దే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది సెలబ్రెటీలు వంటలు చేస్తూ, డ్యాన్సులు చేస్తూ, తమ కుటుంబ సభ్యులతో జాలీగా గడుపుతున్న వీడియోలను షేర్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. మరికొంత మంది రీల్స్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవడంలో మునిగిపోయారు. ఇక మరి కొంతమందేమో అలా రీల్స్, వీడియోలు చేస్తూ వైరల్ అవుతూ, పాపులారిటీని కూడా పెంచుకున్నారు.

ఇక అదే తరహాలో నటి ప్రగతి కూడా తన హవాను కొనసాగించింది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈమె, ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఆమె వీపరితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు సంపాదించుకుంది. నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆమె, సినిమాల్లో నటిస్తూనే, ఇలా తన ఇన్నర్ టాలెంట్‌ను ప్రజానీకానికి తెలియజేస్తోంది.

కాగా ఆమె తాజాగా షేర్‌ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక గంపను ఎత్తుకొని వచ్చి, అందులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రసాదాలను వీక్షకులకు చూపిస్తుంది. తాను చాలా అదృష్టవంతురాలిని అని, ఆ దేవుడి ప్రసాదం, ఆశీర్వాదాలు తనకు అందాయన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీడియోను చూసిన పలువురు ప్రముఖులు తమక్కూడా ఆ ప్రసాదం పంపించాలని కోరినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటివరకూ ఈమె తెలుగులో 100కు పైగా చిత్రాల్లో నటించి, ఉత్తమ నటిగా రెండు నంది అవార్డులు కూడా అందుకోవడం విశేషం.