తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి జ్యోతి ఒకరు. ఈమె క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో నటి జ్యోతి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్నారు.ఈ క్రమంలోని ఈమె మాట్లాడుతూ ఒకానొక సమయంలో నా గురించి ఎన్నో ఆరోపణలు వచ్చాయి అయితే నేను వాటి గురించి పట్టించుకోను కేవలం నాకు తోచిన విషయాల గురించి నేను ఓపెన్ గా మాట్లాడతానని ఆమె వెల్లడించారు.
ఈ క్రమంలోనే నటి జ్యోతి మాట్లాడుతూ ఒక కేసులో తనని ట్రాప్ చేసి తనపై డ్రగ్స్ కేసు మోపడానికి ప్రయత్నాలు చేశారని అలా నన్ను మోసం చేయాలని చూసిన వారు ఎవరూ కూడా ఇప్పటివరకు బాగుపడలేదు. అలా ఒకప్పుడు నన్ను మోసం చేసిన వారు ప్రస్తుతం కుక్కచావు చస్తున్నారని జ్యోతి షాకింగ్ కామెంట్ చేశారు.
ఇలా నన్ను వేధింపులకు గురిచేసిన ఏ ఒక్కరు ఇప్పటివరకు బాగుపడలేదు అని పరోక్షంగా తనని ఇబ్బంది పెట్టిన వారి గురించి మాట్లాడారు. ఇక ఒక వ్యక్తితో జీవితం పంచుకొని కొన్ని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకున్నానని మరొకసారి పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశం తనకు లేదని తెలియజేశారు. ఎంతో ఇష్టపడిన వ్యక్తితో విడాకులు తీసుకోవడం వల్ల ఆ సమయంలో చాలా డిప్రెషన్లోకి వెళ్లి పోయానని అయితే మా నాన్న ఒక అడ్వకేట్ కావటం వల్ల అతని సపోర్ట్ తో ప్రస్తుతం నేను ఇలా ఉండగలుగుతున్నానని వెల్లడించారు.