Sreekanth: ఆమె సినిమా చేస్తున్నపుడు తాను హీరో, ఊహా హీరోయిన్ అన్నంత వరకే ఉండేదని, ఆ తర్వాత ఆమె మెంటాలిటీ మెల్ల మెల్లగా తెలిసొచ్చిందని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. ఆ తర్వాత తనతో ఒక 3,4 సినిమాలు చేశామని, ఆ సందర్భంలో తన గురించి కొంచెం కొంచెం తెలిసేదని ఆయన చెప్పారు. కొన్ని వేడుకలకు, పండగలకు కొందరు ఆర్టిస్ట్‌లతో పాటు తనను కూడా పిలిచేవారమన్న ఆయన, అలా ఇంట్లో వాళ్లకు నచ్చి, ఇంట్లో వాళ్లతో కలిసిపోవడం జరిగాయని శ్రీకాంత్ తెలిపారు.
ఇలా మాట్లాడుతూ ఉన్నపుడు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని తెలిసినా.. మొదట మాత్రం తానే వెళ్లి ఊహకు ప్రపోజ్ చేశానని శ్రీకాంత్ చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మద్రాస్‌కి వెళ్లిపోయి, మేము ఇలా అనుకుంటున్నాం.. ఫిక్స్ ఇంక అని వాళ్లింట్లో వాళ్లతో చెప్పేసేనానని ఆయన నవ్వుతూ తన ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలను శ్రీకాంత్ వెల్లడించారు.
ఇకపోతే తనకు ఏ మాత్రం డిఫ్రెషన్గా అనిపించినా అది ఇంట్లో వాళ్లలో గడిపితే పోతుందని శ్రీకాంత్ చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని, ఊహా కూడా ఒక ఆర్టిస్టే కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా ఇంట్లో ప్రశాంతంగా ఏదైనా చేయగలుగుతారని ఆ విషయంలో తనకు కచ్చితంగా అది ఉంటుందని ఆయన అన్నారు. ఇంటికొచ్చాక గొడవలు లాంటి ఏమైనా ఉంటే మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుందని ఆయన చెప్పారు. కానీ తనకు మాత్రం తన ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుందని ఆయన తెలిపారు.