Megastar Chiranjeevi: అందరిలోనూ ఆచార్యను చూస్తుంటా… ఆచార్య ప్రెస్ మీట్ లో చిరు షాకింగ్ కామెంట్స్!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదలకు సిద్ధమైంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ వేడుక, ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ చిత్రబృందం ఎంతో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.మీ జీవితంలో మీకు ఆచార్య ఎవరు అనే ప్రశ్న మెగాస్టార్ కు ఎదురుగా కాగా ఆయన ఎంతో ఆసక్తికరమైన సమాధానం తెలియజేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తుంటానని ఈ సందర్భంగా మెగాస్టార్ ఆసక్తికరమైన సమాధానం తెలియచేశారు. ఆచార్య అంటే మనకు విద్యాబుద్ధులు నేర్పేవారు. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ప్రతి ఒక్కరి నుంచి తాను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని ఈ సందర్భంగా మెగాస్టార్ వెల్లడించారు. మొత్తానికి ఈ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ధర్మస్థలి నేపథ్యానికి నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.ఇలా ఆచార్య సినిమా ద్వారా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే తెరపై గర్జించడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.