అభిమాన హీరోని కలవడానికి కారు వెంటే పరిగెత్తాను: దుల్కర్ సల్మాన్

మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో బాగా ఆకట్టుకున్నాడు. గతంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. కానీ సీతారామం సినిమాతో ఇటు సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా దుల్కర్ సల్మాన్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందాడు.

ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన ‘చూపు..ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే సినిమా సెప్టెంబర్ 23న విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే గతంలో ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తన అభిమాన హీరో గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమాన హీరో అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

టీనేజ్ లో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి ఆలివ్ కు వెళ్ళినప్పుడు సల్మాన్ ఖాన్ ని కలవటానికి ఆయన కారు వెంట పరిగేతినా కూడా ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. సల్మన్ ఖాన్ ని కలవటానికి చాలా సమయం ఎదురుచూసిన కూడా ఆయన కారు నుండి బయటికి రాలేదని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఇప్పటివరకూ కూడా సల్మాన్ ఖాన్ ని కలిసే అవకాశం తనకు దక్కలేదని ఈ సంధర్భంగా చెప్పుకొచ్చాడు.