Prakesh Raj: పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టం అని, ఒక వ్యక్తి నాయకుడు కావాలనుకోవడం తనకు ఇష్టమని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కానీ కొన్ని నిర్ణయాలు నచ్చకపోవచ్చు అవి వెంటనే చెప్పేస్తానని, అలా అని ఆయనంటే ధ్వేషం ఉందని కాదని ఆయన చెప్పారు. ఆయన కారణాలు ఆయనకుండొచ్చు. కానీ ఆయన్ని తను ఇష్టపడతాను కాబట్టి ఆ హక్కు తనకుందని ఆయన అన్నారు. ఆయన కూడా అంతే గొప్ప మనసుతో భిన్నాభిప్రాయాలున్నాయి, స్వీకరిస్తాను.. కానీ నా దారి నాది అని అనుకొని, ప్రకాశ్ రాజు మంచి నటుడు, ఆయన లేకపోతే నేను కూడా సినిమాల్లో అంత బాగా నటించేవాడిన కాదేమో అని అంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా అని ఆయన చెప్పారు.
కాబట్టి భిన్నాభిప్రాయాలతో ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరొకరు మాట్లాడే హక్కు ఇస్తూ బతికే బతుకు తనకు కావాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. అలాంటి సమాజం తనకు కావాలనుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆయన పెద్ద మనిషయ్యాడు, తాను నిజాయితీగా ఉన్నాను, ఆయన కూడా నిజాయితీగా ఉన్నాడు.. ఇది కదా ముఖ్య అని ఆయన చెప్పారు. తర్వాత ఏం డిసైడ్ చేస్తామనేది తర్వాత కదా అని ఆయన అన్నారు.
ఇకపోతే ప్రస్తుతమున్న ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మారాల్సిన అవసరం చాలా ఉందని ఆయన చెప్పారు. మారే దాకా ఇలాగే పోరాడుతూ ఉంటానని ఆయన చెప్పారు. మతం, కులం, జాతి, ప్రాంతీయత వీటన్నింటిలో ఏవైనా సరే మార్చే దాకా తన పోరాట ఆపనని ఆయన వివరించారు.