Raja Ravindra : మెగాస్టార్ తిట్టినా నాకు నచ్చుతుంది…. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజా రవీంద్ర…!

 

Raja Ravindra : తెలుగు ఇండస్ట్రీ లో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాజా రవీంద్ర. ఎన్నో సినిమాల్లో నెగెటివ్ పాత్రలు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసారు. పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయి సినిమాలలో మంచి అవకాశాలు దక్కించుకుని గుర్తింపు పొందిన రాజా, రవితేజ వంటి హీరోలకు డేట్స్ మేనేజ్ చేయడం కూడా చేసేవారు. ఇక తమిళ్ లో కూడా బాగానే పాపులర్ అయ్యారు కాని సాయిగా ప్లాన్ చేసి ఉంటే కెరీర్ లో పీక్స్ లో ఉండేవారు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు.

సినిమాల్లోకి రావడానికి చాలా మందికి మెగా స్టార్ చిరంజీవి స్ఫూర్తి. అలాగే రాజా రవీంద్ర గారికి కూడా సినిమాల్లోకి రావడానికి చిరంజీవిగారు స్ఫూర్తి అనీ చాలా సందర్భాల్లో చెప్పారు.

ఇక మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో రాజా నటించారు.ఈ సినిమా షూటింగ్ సందర్బంగా జరిగిన ఒక సంఘటన ను ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పారు .అన్నయ్య నాకెంతో క్లోజ్‌.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను.

ఆచార్య షూటింగ్‌లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తూ ఉన్నాను . దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుందని చెప్పాను. దానికాయన ఖర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది కానీ, నాకు బాగుంటుంది’ అని చెప్పాడు రాజా రవీంద్ర. చిరంజీవి గారిలో చాలా మెచూరిటీ ఉంటుందని ఆయన ఎదుటివారిని ఇట్టే పసిగట్టగలరని చెప్పారు రాజా.