పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా రాబోతున్నారు.ప్రభాస్ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం రెండు ఎపిసోడ్లుగా ప్రసారం కానున్నట్లు ఆహా అధికారకంగా తెలియచేసింది. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీ ప్రసారం కానుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.
ప్రభాస్ ను బాలకృష్ణ ప్రశ్నిస్తూ అసలేంటి పెళ్లి అనేది ఉందా లేదా అని అడగగా ప్రభాస్ వెంటనే మనకు రాసి పెట్టలేదు వదిలేయండి సార్ అంటూ సమాధానం చెప్పకొచ్చారు.దీంతో బాలకృష్ణ నువ్వు మీ అమ్మకు చెప్పిన సమాధానం నాకు చెప్పకు అంటూ నవ్వులు పూయించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా మెగా హీరో రామ్ చరణ్ కు బాలకృష్ణ ఆడియో కాల్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ గురించి రాంచరణ్ కూడా ఏదో సీక్రెట్ లీక్ చేశారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ మాత్రం రామ్ చరణ్ కు తనదైన స్టైల్ లో చిన్న వార్నింగ్ ఇచ్చారు.సంక్రాంతి కానుకగా నా సినిమా మీ నాన్న సినిమా రెండు విడుదలవుతున్నాయి ముందు నా సినిమానే చూడాలి తర్వాత మీ నాన్న సినిమా చూడు అంటూ సరదాగా చెప్పారు.మరి బాలకృష్ణ ఇలా చెప్పడంతో రామ్ చరణ్ ఏ సమాధానం చెప్పారనే విషయం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రభాస్ బాలకృష్ణ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.