Samyuktha Menon: టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో వరుస సక్సెస్ లు అందుకుంటున్న హీరోయిన్స్ సంఖ్య చాలా తక్కువ. ఇక అందులో టాలెంట్‌తో, అందంతో, వెండితెరపై ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న వారిలో సంయుక్త మీనన్ ఒకరు. ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ మొదట్లోనే లక్కీ అని నిరూపించింది. ఇక ఆ తరువాత మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంది.
అమ్మడి కెరీర్ ట్రాక్ లో బింబిసార, సార్, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో స్వయంభు, అఖండ 2, బింబిసార 2 లాంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అమ్మడు వరుస విజయాలతో ఇండస్ట్రీలో లక్కీ చామ్‌గా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త ఓ సంచలన నిజాన్ని బయటపెట్టింది.
సాధారణంగా సినీ తారలు తమ వ్యక్తిగత జీవితం గురించి బయట పెద్దగా మాట్లాడరు. కానీ సంయుక్త మాత్రం తన ఓ అలవాటును అభిమానులతో బహిరంగంగా పంచుకుంది. “నాకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది. కానీ అది రోజూ కాదులెండి.. ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం తాగుతాను” అని నొచ్చుకోకుండా చెప్పేసింది. తారలు ఇలాంటి అలవాట్లను బయటపెట్టడానికి సంకోచిస్తారు. కానీ సంయుక్త మాత్రం కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సినీ రంగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. షూటింగ్‌లు, ప్రమోషన్లు, ఒత్తిళ్లు అన్నీ కలిపి వాళ్లను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. చాలా మంది తారలు ఈ ప్రెజర్‌ని తట్టుకోవడానికి విభిన్నమైన మార్గాలను అనుసరిస్తారు. ఎవరో వర్కవుట్స్ చేస్తారు, మరికొందరు యోగా, ట్రావెలింగ్‌తో రిలాక్స్ అవుతారు. మరి కొంత మంది ఈ ఒత్తిడిని తాగుడుతో తగ్గించుకుంటారు. ఇప్పటి వరకు హీరోలు మాత్రమే ఇలా తమ అలవాట్ల గురించి బయటపెడుతూ ఉండేవారు. కానీ ఒక హీరోయిన్ తెగించి చెప్పడం చాలా అరుదు.
ఈ విషయంపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఆమె నిజాయితీని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం.. ఇలా ఓపెన్‌గా చెప్పేసిందేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంయుక్త చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. నిఖిల్‌తో చేస్తున్న ‘స్వయంభు’ సినిమాపై అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. అలాగే బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా హై రేంజ్ లోనే రూపొందుతోంది. ఇక హిట్ సీక్వెల్ ‘బింబిసార 2’ లో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరుస విజయాలతో ఆమె కెరీర్ టాప్ గేర్‌లో నడుస్తోంది.