Ranaa Daggubati: నాకు పెళ్లయింది కనుకే ఈ సినిమా ఇంత అద్భుతంగా నటించాను… రానా షాకింగ్ కామెంట్స్!

Ranaa Daggubati: సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ చిత్రంగా నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతగా ఉందో రానా పాత్ర కూడా అంతే ఉంది. కొన్ని సన్నివేశాలలో రానా పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ…సాధారణ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఎంతో భిన్నంగా అనిపించడం వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని రానా తెలిపారు.ఇక ఈ సినిమాకి మలయాళ సినిమాకి ఏమాత్రం పోలికలు లేకుండా ఈ సినిమా స్క్రిప్టు మొత్తం మార్పులు చేశారని వెల్లడించారు. ఇక ఈ సినిమాకు భీమ్లా నాయక్ పాత్రలో రానా సెలెక్ట్ అయిన తర్వాత ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయని రానా తెలిపారు.

ఇక డైరెక్టర్ సాగర్ కే చంద్రకు భిన్నమైన సినిమాలు అంటే ఎంతో ఇష్టం అందుకే ఈ సినిమా అవుట్ పుట్ ఇలా వచ్చిందని తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో సంయుక్త మీనన్ తో కలిసి తన నటన ఎంతో అద్భుతంగా వచ్చిందని రానా తెలిపారు. నిజ జీవితంలో తనకు పెళ్ళి జరగడం వల్లే సంయుక్తతో కలిసి నటించే సన్నివేశాలు బాగా నటించానని తెలిపారు. ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నానని రానా తెలిపారు. ఇక త్వరలోనే రానా నటించిన విరాటపర్వం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.