టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటిగా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పరిచయాన్ని పెంచుకుందని చెప్పవచ్చు. నిత్యం ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఈ భామ చాలా ఏళ్ల తర్వాత నాతిచరామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది. చిన్నతనం నుంచి తనకు సినిమా అవకాశాలు వచ్చాయని.. కానీ ఫ్యామిలీ కోసం అవకాశాలు వదులుకున్నానని తెలిపింది. కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం వచ్చిందని.. కానీ వదులుకున్నానని.. ఎందుకంటే నటనను కెరీర్గా మార్చుకోవాలని అనుకోలేదని.. కానీ అనుకోకుండా మళ్లీ వచ్చానని తెలిపింది. ఇక నాతిచరామి సినిమా కేవలం కథ వల్ల ఒప్పుకున్నానని తెలిపింది.