నేనెవ్వరితో పోటీపడను.. నటనపైనే దృష్టి పెడతానన్న కత్రినా !

తాజాగా ‘టైగర్‌ 3’ చిత్రంతో ఆకట్టుకున్నారు కత్రినా కైఫ్‌. నటన, గ్లామర్‌తోపాటు ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఆదరగొట్టారు. నటిగా ఆమె ప్రయాణం మొదలుపెట్టి 20 ఏళ్లు పూర్తయింది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ’రెండు దశాబ్దాల సినీ జీవితంలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నా.

నేనేప్పుడూ ఎవరితోనూ పోటీ పెట్టుకోలేదు. నాతోనే పోటీపడుతూ వచ్చా. ప్రతి సినిమాలో నా నటనను కంపేర్‌ చేసుకుంటా. ఎప్పుడూ పని కోసం ఆరాటపడుతుంటాను. రిలాక్స్‌ అవ్వడం నాకు నచ్చదు. కొత్తగా ఏదన్నా చేయాలనే తపన ఎక్కువ. దానికోసం నాకు నేనే ప్రోత్సహించుకుంటా. నా కెరీర్‌ తొలి రోజుల్ని గుర్తుతెచ్చుకుంటే ఎంతో సాధించాననిపిస్తుంటుంది. ఆ విషయంలో ఎంతో గర్వంగా ఉంటుంది.

నటిగా వేలాదిమంది అభిమానం పొందడంతో ఎంతో అదృష్ట వంతురాలిననే భావన కలుగుతుందని పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ’బూమ్‌’ సినిమాతో నటిగా కెరీర్‌ ప్రారంభించిన కత్రినా.. ’మల్లీశ్వరి’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. బాలకృష్ణతో అల్లరి పిడుగు చిత్రంలో నటించారు ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కత్రినా చిత్రం ’టైగర్‌3’ మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. మనీష్‌ శర్మ దర్శకత్వం వహించారు.