అల్లు అర్జున్‌ను నేను అలా అనలేదు : అనసూయ

యాంకర్‌ అనసూయ కేరీర్‌ ఆరంభం నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. ఆమె ఎక్కడ మాట్లాడినా ఎక్కడో ఏదో విషయంలో అడ్డంగా బుక్‌ అవుతూ ఉంటుంది. తాజాగా ఇటీవల ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూతో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. టీవీ నుంచి సిల్వర్‌స్క్రీన్‌కు ఆప్‌గ్రేడ్‌ అయిన అనసూయ అనతి కాలంలోనే వినూత్న పాత్రలు పోషిస్తూ బిజీ అవుతూ వస్తున్నది. ముఖ్యంగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం, పుష్ఫ’ సినిమాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తమిళంలోనూ కొన్ని సినిమాల్లోను నటించింది.

ఇదిలాఉండగా ఈ మధ్య సినిమాలతో కాకుండా తన సోషల్‌విూడియా పోస్టులు, సెటైర్లతో ట్రెండిరగ్‌లో ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఈ మధ్య ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో ‘అల్లు అర్జున్‌ సామాజిక మాధ్యమాల్లో తన డ్యాన్స్‌ గురించి ఫ్యాన్స్‌ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని తన అప్‌కమింగ్‌ సినిమాలలో సరి చేసుకుంటాడని, అదేక్రమంలో పుష్ప సినిమాలో కొన్ని మిస్టేక్స్‌ చేశాడని ఇప్పుడు ‘పుష్ఫ2’లో అలా జరగకుండా చూసుకుంటున్నాడని’ ఆమె చెప్పినట్లుగా వార్తలు వైరల్‌ అయ్యాయి.