సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శృతిహాసన్ తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో, సలార్ కి కొనసాగింపుగా వస్తున్న సలార్ శౌర్యంగ పర్వం సినిమాలోని నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావిస్తూ వివాహ బంధం పై తన నిర్ణయాన్ని చెప్పారు.
అప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన శృతి తర్వాత మళ్లీ మాట మార్చేశారు. అలా చెప్పలేదని అంటూ మరొక వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అదేమిటంటే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఊహించని విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ ఎప్పటికీ చేసుకోను అని చెప్పలేదు. బేసిగ్గా నేను రొమాంటిక్ పర్సన్ ని రిలేషన్ లో ఉండటాన్ని ఇష్టపడతాను.
నా చుట్టూ ఉండే వారితో చనువుగా ఉండటానికి ఇష్టపడతాను, అయితే జీవితాంతం ఒకరితోనే ఉండిపోవాలి అని అనిపించినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం నా స్నేహితులు బంధువులు ఎంతోమంది పెళ్లి తర్వాత కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటూ తను ముందు ఇచ్చిన స్టేట్మెంట్ కి వివరణ ఇచ్చింది. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్స్ అయ్యో అక్క అప్పుడే మాట మార్చేసింది అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఆమె పెళ్లి గురించి రిలేషన్ గురించి మాట్లాడటం ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా తను రిలేషన్ గురించి చాలాసార్లు తన ఫ్యాన్స్ కి ఆన్సర్ చేసింది. ఈ మధ్యనే ఒక ఫ్యాన్ మీరు సింగిలా, రిలేషన్ లో ఉన్నారా అని ప్రశ్నించగా నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు కానీ చెబుతున్నాను, నేను ప్రస్తుతం సింగిల్, రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతానికి పనిలో మునిగిపోయాను జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది ఈ బోల్డ్ బ్యూటీ.