Home TV SHOWS మల్లెమాలను తిట్టాడా? పొగిడాడా?.. హైపర్ ఆది మామూలోడు కాదు!!

మల్లెమాలను తిట్టాడా? పొగిడాడా?.. హైపర్ ఆది మామూలోడు కాదు!!

హైపర్ ఆది తన స్కిట్స్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని పది పంచ్‌లు, వాటిలో ప్రాసను కలుపుతాడు. అలా స్టేజ్ మీదకు వచ్చి ఫటా ఫట్ అందరికీ ఇచ్చి పడేస్తాడు. అలా ఓ పది నిమిషాలు స్కిట్‌లో నాన్ స్టాప్‌గా నవ్విస్తాడు. హైపర్ ఆది ప్రతీ స్కిట్‌లో కాన్సెప్ట్ కంటే కంటెంట్ కంటే పంచ్‌లు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటాడు.

అలా హైపర్ ఆది ఇంటా బయటా జరిగే ట్రెండీ టాపిక్‌ల మీదే స్కిట్స్ ప్లాన్ చేస్తాడు. ఒకప్పుడు అదిదింది జబర్దస్త్ మధ్య ఉండే పోటీ, జరిగే గొడవల నేపథ్యంలో స్కిట్ చేశాడు. రష్మీ అనసూయ మధ్య ఉన్న గొడవలు, అనసూయ అక్కడా ఇక్కడా చేయడంపైనా సెటైర్లు వేశాడు. ఇలా ప్రతీ సారి కొత్తగా కొన్ని విషయాలు బయట పడేలా పరోక్షంగా పంచులు వేస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది అదే పని చేశాడు.

Hyper Aadi Satire On Mallemala
Hyper Aadi satire On Mallemala

కారు జబర్దస్త్ అట.. అందులో పెట్రోల్ ఈటీవీ అట.. స్టీరింగ్ మల్లెమాల.. డ్రైవర్ రోజా.. అంటూ చెప్పుకొచ్చాడు. పెట్రోల్ (ఈ టీవీ) లేకపోతే కారు (జబర్దస్త్) నడవదు.. స్టీరింగ్ (మల్లెమాల) చెప్పినట్టే కారు (జబర్దస్త్) నడవాలి. లేదు కుదరదు మా ఇష్టం అంటే అందర్నీ పక్కకు నెట్టేస్తుందంటూ హైపర్ ఆది సెటైర్ వేశాడు. ఏది ఏమైనా మల్లెమాల మీదే సెటైర్ వేయడం అంటే హైపర్ ఆది రేంజ్ మామూల్ది కాదు.

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

బిగ్ బాస్ లవ్ స్టోరీలు.. భలేగా రాశారే.!

రియాల్టీ షో అనే పేరు పెట్టారుగానీ, అందులో రియాల్టీ కనిపించడంలేదు మొర్రో.. అంటూ పాపం బిగ్ బాస్ అభిమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. దానికన్నా యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా సాగుతోన్న 'మీలో...

Related Posts

Latest News