Hyper Aadi: కామెడీ స్టార్స్ లో సందడి చేయనున్న హైపర్ ఆది… ఇందులో నిజమెంత?

Hyper Aadi: హైపర్ ఆది ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది తన కామెడీ స్కిట్, డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి కీలకంగా మారిన హైపర్ ఆది గత మూడు సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణం ఆయన కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఈ కార్యక్రమానికి కీలకంగా మారారు. ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ పెంచాలని మల్లెమాల వారిని కోరగా అందుకు మల్లెమాల నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకే హైపర్ ఆది ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారని సమాచారం. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన కమెడియన్ లకు స్టార్ మా ఆహ్వానం పలుకుతుంది.

ఈ క్రమంలోనే జబర్దస్త్ నుంచి వచ్చిన అదిరే అభి, ధన్ రాజు, ముక్కు అవినాష్ వంటి వారికి స్టార్ మా ఆహ్వానం పలుకుతూ వీరందరితో కామెడీ స్టార్స్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన హైపర్ ఆది త్వరలోనే కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ప్రత్యక్షమౌతారు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజంగానే హైపర్ ఆది జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి స్టార్ మాలో ప్రత్యక్షం కానున్నారా హైపర్ ఆది గురించి వస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.