బిగ్ బాస్ 4 .. అనుకున్నది అంతా అయ్యింది .. మొదలు కాకముందే .. అయ్యయ్యో … ! అసలింతకీ ఏమైంది? తెలియాలంటే మ్యాటర్ లోకి వెళ్లాలి.
విద్యార్థి సంఘాలు.. కుల సంఘాలు.. మహిళా సంఘాలు తెచ్చేంత ఉచిత ప్రచారం ఇంకెవరూ తేలేరేమో! గత మూడు సీజన్లు బిగ్ బాస్ అభిమానులకు అర్థమైన విషయం ఇదీ. మానవ హక్కుల సంఘాలు కూడా యాడైతే పబ్లిసిటీ మరింత రంజుగానే ఉంటుంది. ఈ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల్లో పాశ్చాత్య ధోరణి పెట్రేగిపోవడానికి ప్రధాన కారణం!! అంటూ సాంప్రదాయవాదులు విమర్శిస్తూనే ఉన్నారు. గత మూడు సీజన్లకు ఇది ఎదురైంది. ఈసారి కూడా ఇది తప్పలేదు. సీజన్ 4 మొదలవ్వక ముందే మొదలెట్టేశారు రచ్చ.
మరోసారి విద్యార్థి సంఘం నాయకులు .. తెలంగాణ రాష్ట్ర మహిళాధ్యక్షులు బరిలో దిగి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో మరోసారి రచ్చ పీక్స్ కి చేరుతోంది. జనాలకు తప్పుడు సందేశం ఇచ్చే బిగ్ బాస్ ని నిషేధించాలన్నది వీరి డిమాండ్. యూత్ ను తప్పుదారి పట్టించే ఇలాంటి షోలను ఆపేయాలి. ఇవి ఇలానే కొనసాగితే సహించం అంటూ మహిళామండళ్లు వార్నింగులు ఇచ్చాయి.
కానీ ఏం లాభం? ఇలాంటివన్నీ మ్యానేజ్ చేయడంలో బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధహస్తులు. పైపెచ్చు వివాదంతో ప్రచారం వీళ్లకో హ్యాబిట్. అందువల్ల ఎవరెంత అల్లరి చేసినా అరిచి గీపెట్టినా ఇదింతే. మానవ హక్కుల సంఘమే ఇన్వాల్వ్ అయినా ఇందులో మార్పేమీ ఉండదన్న సెటైర్లు పడుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 4 సీజన్ స్టార్ మాలో లైవ్ కానుంది. 16 మంది పార్టిసిపెంట్స్ ఇప్పటికే ఎంపికవ్వగా 100 రోజుల పాటు ట్రీట్ కి సర్వసన్నాహకాల్లో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాల్లో సెట్ వేసి బిగ్ బాస్ సీజన్ 4 ను చిత్రీకరిస్తున్నారు.