వివాదాస్పద ఫిలిం మేకర్‌గా సరికొత్త గుర్తింపుని ఖరారు చేసుకున్న ఒకప్పటి సెన్సేషనల్ ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ పేరుతో ఓ పొలిటికల్ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా ఈ మేరకు ఆయన భేటీ అయ్యారు కొన్నాళ్ళ క్రితం. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ ప్రచారం కూడా జరిగింది.
అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్టు అటకెక్కిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో ఆర్జీవీని వైసీపీ ఎంటర్టైన్ చేయడంలేదన్నది తాజాగా అందుతున్న సమాచారం.
ఆర్జీవీ స్థానంలో ఓ టాలెంటెడ్ డైరెక్టర్ని ఓ వైసీపీ నేత ఒకరు సంప్రదించారట. ఆయనే వైసీపీకి కావాల్సిన పొలిటికల్ సినిమా తెరకెక్కించబోతున్నారట. అలాగని, ఆర్జీవీ.. వైసీపీ మీద తిరగబడే పరిస్థితి లేదు. ఆయనతో వైసీపీ నేతలు కొందరు సత్సంబంధాలైతే కొనసాగిస్తూనే వుంటారట.