ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సహా హిందీ మార్కెట్ లో కూడా భారీ అంచనాలు నడుమ రాబోతున్న చిత్రం “సలార్”. మరి ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కన్నడ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకి మొదటి నుంచి కూడా చాలానే అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సినిమా సంబంధించి వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి బిజినెస్ అయ్యిన సంగతి తెలిసిందే.
మరి ఇంత మొత్తాన్ని రాబట్టడం అనేది సాధారణ టికెట్ రేట్స్ తో సాధ్యమయ్యే పని కాదు. కాగా ఏపీలో పక్కన పెడితే మెయిన్ గా నైజాంలో మాత్రం భారీగా టికెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. నైజాంలో సినిమా హక్కులు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేయగా వారి హై క్లాస్ టికెట్ కి ఏకంగా అదనంగా 100 రూపాయలు పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారట.
తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంకి వారు ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టారని ఈ 100 రూపాయల పెంపు మల్టీప్లెక్స్ లలో కూడా వర్తిస్తుంది అని అంటున్నారు. ఇదే కానీ నిజం అయితే వసూళ్లు ఎక్కువే ఓపెనింగ్స్ రావచ్చు కానీ ఇంత మొత్తం పెంపు అంటే ఫ్యాన్స్ మినహా మిగతా ఆడియెన్స్ మీద భారమే అని చెప్పాలి. ఇది వరకు 50 అలా తెలంగాణ ప్రభుత్వం పెంచుకునేందుకు అవకాశం ఇచ్చేది. మరి సలార్ విషయంలో ఏమవుతుందో చూడాలి.