RRR Collections: తొలిరోజే భారీ వసూళ్లు… హాలీవుడ్ సినిమాను దాటిన ఆర్ఆర్ఆర్ హవ!

RRR Collections: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ మానియానే కనిపిస్తుంది. దాదాపు నాలుగేళ్ల రాజమౌళి అండ్ టీమ్ కష్టానికి ప్రతిరూపం ఈ సినిమా. భారీ అంచనాల మధ్య తాజాగా ఈ సినిమా విడుదల అయిన విషయం అందరికీ తెలిసిందే. ముందు నుంచే ఈ సినిమాకి భారీ స్థాయిలో అంచనాలు ఉండడంతో అదే స్థాయిలో విడుదలకు కూడా భారీ సన్నాహాలు చేశారు మూవీ మేకర్స్.

ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాపై అటు మెగా ఫ్యాన్స్ మరియు మరోపక్క నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తొలి రోజులోనే ఆర్ ఆర్ ఆర్ భారీ విజయాన్ని అందుకుంటుంది అన్న లెవెల్ లోకి ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. బాహుబలి తర్వాత మళ్లీ అంతకు మించిన స్థాయిలో ఈ సినిమా రికార్డ్ లు సృష్టించడం భారతీయ సినిమా కే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఐతే ఈ సినిమాకు ఇండియా లెవెల్ లోనే కాక, అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనూ బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ నడుస్తుంది అంటే ఈ సినిమా ఆ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుందో తెలుస్తూనే వుంది.

అయితే ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలను సైతం దాటుకొని బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుందంటే తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్ కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇక హాలీవుడ్ చిత్రం బ్యాట్ మాన్ తొలి రోజు 1.4 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తే, ఈ సినిమా 3.1 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇలా ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన టాక్ వినిపిస్తోంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎన్టీఆర్, చరణ్ ల యాక్టింగ్ మరియు రాజమౌళి టేకింగ్ అద్భుతం అని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు వస్తున్న పాపులారిటీని మూవీ టీమ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ కూడా తమ పట్ల ఇంత ప్రేమ, ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.