మీ రెమ్యూనరేషన్ మొత్తం మాకే ఇస్తే మీరు ఎలా బతుకుతారు… ఆది సెటైర్!

Navya Swami: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.ప్రతివారం ప్రసారమవుతో ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్న ఈ కార్యక్రమంలో హైపర్ ఆది పంచ్ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమైన హైపర్ ఆది ఢీ షోలో మాత్రం ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది నవ్య స్వామి దారుణంగా అవమానించారు.

హైపర్ ఆది ఈ విధంగా సదరు సెలబ్రిటీల పై సెటైర్లు వేయడం కేవలం స్కిట్ లో భాగం కావడం వల్ల పెద్దగా ఎవరూ అతని మాటలను పట్టించుకోలేదు. అయితే తాజాగా హైపర్ ఆది, నవ్య స్వామి, సుస్మిత ముగ్గురు కలిసి ఒకేసారి వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా మేము ముగ్గురం ఎంట్రీ ఇచ్చామని అంటారు ఇక చూసుకోండి స్క్రీన్ స్పేస్ మొత్తం మేమే తినేస్తామని సుస్మిత అంటుంది.వెంటనే హైపర్ ఆది స్పందిస్తూ మీరు స్క్రీన్ స్పేస్ తినండి నేను అంటూ ఏదో చెప్పబోయి అంతటితో ఆగిపోతారు.

ఇక నవ్యస్వామి మాట్లాడుతూ ముగ్గురం ఒకే ఫ్రేమ్ లో ఉంటే అని నవ్య స్వామి అనగా.. వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ అప్పుడు నా ఫేమ్ పోతుంది అంటూ దారుణంగా నవ్య స్వామిని అవమానించారు. ఇక ఆది రవి కృష్ణ ఇద్దరు స్టేజీపై కూర్చోగా ప్రదీప్ వారి ముందు కర్చీఫ్ వేస్తాడు. ఇలా కర్చీఫ్ వేయడంతో నవ్య స్వామి 2 వేలు,సుస్మిత 500 వారికి వేయగా వెంటనే హైపర్ ఆది మీ రెమ్యూనరేషన్ మొత్తం మాకు ఇస్తే మీరు ఎలా బతుకుతారు అంటూ మరోసారి వారి పై సెటైర్లు వేశారు.