హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గేర్ మార్చింది.. మళ్ళీ అందుకు సిద్దం అట..?

‘ఒరేయ్ బుజ్జిగా’ ..ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఆహా లో రిలీజైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాకి ‘గుండజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ తో తీసిన ఈ సినిమా తో సక్సస్ అందుకున్నాడు. అంతేకాదు గత కొంతకాలంగా సక్సస్ లకి దూరంగా ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తో పాటు హాట్ బ్యూటి హెబ్బా పటేల్ కి మంచి హిట్ ఇచ్చాడు.

కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించారు. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత అటు రాజ్ తరుణ్ ఇటు హెబ్బా పటేల్ చాలా సినిమాలు చేశారు. కాని కుమారి 21 ఎఫ్ రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. చెప్పాలంటే గత కొంతకాలంగా ఇద్దరి కెరీర్ డైలమాలో పడింది. ఈ సినిమా కంటే ముందు రాజ్ తరుణ్ దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేసి చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కాని ఆ సినిమా ఈ కుర్ర హీరోకి షాకిచ్చింది.

ఇక హెబ్బా పటేల్ నటించిన 24 కిసెస్ తర్వాత టాలీవుడ్ లో దాదాపు కెరీర్ క్లోజ్ అయినట్టే అనుకున్నారు. అందుకే రాం సినిమాలో ఐటం సాంగ్ కూడా ఒప్పుకొని చేసింది. అయితే అనూహ్యంగా హెబ్బా కి ‘ఒరేయ్ బుజ్జిగా’ రూపం లో మంచి హిట్ దక్కింది. ఇక రాం రెడ్ సినిమా కూడా హిట్ అయితే అందులో చేసిన ఐటం సాంగ్ కి మంచి పేరు వస్తే ఈ హాట్ బ్యూటీ కి మళ్ళీ వరసగా అవకాశాలు రావడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ‘ఒరేయ్ బుజ్జిగా’ హిట్ తర్వాత హెబ్బా పటేల్ కి కొందరు మేకర్స్ నుంచి కాల్స్ వస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సారి మాత్రం కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఒప్పుకుంటున్నాని అంటుందట.