గాసిప్స్ : ఎన్టీఆర్ – నీల్ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్ ని లాక్?

NTR31_1-1

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి భారీ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రానున్న లైనప్ కూడా ఒకటి. కాగా ఇప్పటికీ ఆర్ ఆర్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తో అయితే తారక్ గ్లోబల్ హీరోగా మారగా ఈ నెక్స్ట్ సినిమాల్లో మరో పాన్ ఇండియా సెన్సేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ బిగ్గెస్ట్ మాస్ డ్రామాని అయితే తాను అనౌన్స్ చేసాడు.

ఇక ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉండగా ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి ఇంటర్నేషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తున్నట్టుగా కొన్ని క్రేజీ గాసిప్స్ అయితే మొదలయ్యాయి.

అందులో భాగంగా అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ హాలీవుడ్ ఇండో హీరోయిన్ ప్రియాంకా చోప్రా జోనస్ ని అయితే లాక్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో ఒలీవియా మోరిస్ అనే హాలీవుడ్ నటితో నటించాడు.

ఇక ఇపుడు ప్రియాంకా చోప్రా తో వర్క్ చేయడం అనేది మరింత ఎగ్జైటింగ్ గా మారింది పైగా హాలీవుడ్ మార్కెట్ లో ఈ సినిమా మరింత ముందుకు వెళ్తుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంని అయితే మైత్రి మూవీ మేకర్స్ సహా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో అయితే సలార్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.