గ్లింప్స్ టాక్ : క్రేజీగా వెంకీ మామ సరికొత్త వెర్షన్ “సైంధవ్”.!

విక్టరీ వెంకటేష్ హీరోగానే కాకుండా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ కూడా తన కెరీర్ లో ఎంచుకుంటూ వెళ్తున్నారు. రీమేక్స్ అయినప్పటికీ కూడా తన సినిమా నుంచి తనదైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రానాతో ఓ ఏక్షన్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ కి గాను చేస్తుండగా టాలీవుడ్ నుంచి రీమేక్ నుంచి స్ట్రైట్ సినిమాని అందులోని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తాను అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్ లో కేజ్రీగా మారింది.

తన సినిమాలతో టాలీవుడ్ మంచి మార్క్ సెట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను తో అయితే సినిమా ఓకే చేసాడు. ఇక ఈరోజు దీని నుంచి ఓ గ్లింప్స్ వీడియో ని అయితే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ ని రివీల్ చేశారు. ఇక ఈ వీడియో కోసం మాట్లాడినట్టు అయితే “సైంధవ్” అనే టైటిల్ రోల్ లో డెఫినెట్ గా వెంకీ మామ నుంచి ఓ సరికొత్త వెర్షన్ ని మనం చూడవచ్చు.

కంప్లీట్ గా కొత్త బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కనిపిస్తుంది. బుల్లెట్ పై ఓ బాక్స్ అందులో నుంచి ఏదో వైల్ తీయడం ఇది సినిమాలో ఓ కీలక ఎలిమెంట్ గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఓ సూపర్ ఏక్షన్ సీక్వెన్స్ తర్వాత వెంకీ మామ పేల్చిన డైలాగ్ కూడా అదిరింది.

ఇలా మొత్తంగా ఈ వీడియో అయితే అభిమానులకి ముఖ్యంగా మూవీ లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా తాను ఈ వీడియోలో మంచి ఎసెట్ అయ్యాడు. మొత్తానికి అయితే అంతా బాగానే ఉంది మరి ఫుల్ ఫ్లెడ్జ్ గా వచ్చాక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 
Glimpse Of SAINDHAV ( Telugu ) | Venkatesh Daggubati | Sailesh Kolanu | Santhosh Narayanan |