చర్చగా “ఆదిపురుష్” నుంచి అతడి మిస్సింగ్.!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తో చేసిన ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ అయితే భారీ అంచనాలు నెలకొల్పుకుంది. మరి మెయిన్ గా ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో భారీ విజువల్స్ తో తెరకెక్కగా హైప్ ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో అంతా బాగానే ఉంది కానీ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఒకరు మిస్ అవ్వడం అనేది ఇపుడు నెటిజన్స్ లో పలు సందేహాలకు దారి తీస్తుంది. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ఎంత ముఖ్యమో అతడు ఎదుర్కొనే దశకంఠుడు రావణ పాత్రలో చేసిన సైఫ్ అలీఖాన్ పాత్ర కూడా అంతే ముఖ్యం.

అయితే మొదటి టీజర్ నుంచి ఇప్పటికీ కూడా సైఫ్ పై అంత కీలక సన్నివేశాలు పెట్టలేదు కానీ మొదటి నుంచి ఏ ఈవెంట్ లోని సైఫ్ ప్రెజెన్స్ అయితే కనిపించలేదు. మొన్న భారీగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చాలా సినిమా యూనిట్ అంతా కనిపించారు కానీ సైఫ్ మాత్రం లేడు.

పైగా నెక్స్ట్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా సైఫ్ మిస్ అవ్వడంతో అయితే చాలా మందికి ఏవేవో డౌట్స్ వస్తున్నాయి. సైఫ్ వాంటెడ్ గా ఆదిపురుష్ ప్రమోషన్స్ కి రావట్లేదా లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.