ఆదిపురుష్ పై ఆ ఏడుపెందుకు…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. త్రీడీలో విజువల్ గ్రాండియర్ లో సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ తో పాటు హిందూ అభిమానులు అందరూ కూడా థియేటర్స్ వద్ద క్యూ కట్టి చూస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలకి విపరీతమైన స్పందన వచ్చింది.

ఇక సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే కొంతమంది హిందుత్వ సంఘాలు మొదటి నుంచి ఆదిపురుష్ సినిమాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం కథ మాత్రమే వాస్తవం, అదే గొప్పది అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించిన ఆదిపురుష్ లో పాత్రలని వక్రీకరించారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అయితే ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత ఆదిపురుష్ పై వచ్చిన నెగిటివ్ ప్రచారం చాలా వరకు తగ్గింది. కాని ఇంకా కొంత మంది రామానంద్ సాగర్ రామాయణానికి స్టిక్ అయిపోయారు. ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. తాజాగా లాస్ట్ టెంపుల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ హిందూత్వంకి సంబందించిన అంశాలని ఎక్కువగా పోస్ట్ చేస్తుంది.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నాయకులు దీనిని ఫాలో అవుతున్నారు. తాజాగా ఆదిపురుష్ మూవీ రిలీజ్ ముందు ఈ లాస్ట్ టెంపుల్ ట్విట్టర్ హ్యాండిల్ లో రామానంద్ సాగర్ రామాయణం ఫోటోలు, స్క్రీన్ షాట్స్ షేర్ చేసి ఇంకేది కూడా దీనికి సాటి రాదు అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ పై దర్శకుడు హరీష్ శంకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

రామాయణం మీద ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. అయితే ఆదిపురుష్ రిలీజ్ కి కొద్ది రోజుల ముందు అందరూ ఫాలో అయ్యే ఇలాంటి హ్యాండిల్ నుంచి ఈ పోస్ట్ ని అస్సలు ఊహించలేదు. ఐక్యమత్యం అనేది మన సనాతన ధర్మంలో భాగం. ఆ విషయాన్ని అర్ధం చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంకా చాలా మంది రామానంద్ సాగర్ సీరియల్ లో సీతాపహరణం ఎపిసోడ్, ఆదిపురుష్ లో సీతాపహరణంతో పోల్చి చూపిస్తూ… మీరు అభిమానించే రామానంద్ రామాయణంలో సీతకి ఇచ్చిన గౌరవం ఇది అంటూ ట్రోల్ చేస్తున్నారు.