ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన శ్రీయ రష్యన్ యువకుడిని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ విధంగా వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుతున్న ఈమె ఒకవైపు కుటుంబ బాధ్యతలను మరో వైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈమె రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్రలో నటించారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఇక ఈమెకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన భర్త తన కూతురుతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గోవా అందాలను ఆస్వాదిస్తూ ఈమె కూడా అందాల జాతర చేశారు. గులాబీ రంగు బికినీ ధరించి బీచ్ లో శ్రీయ సందడి చేశారు. ఈ క్రమంలోనే తనతోపాటు తన కూతురుతో కలిసి బీచ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తూ తను ఎప్పుడూ తన కుటుంబంతో సంతోషంగా గడపాలని కామెంట్ చేస్తున్నారు.