వరల్డ్ లోనే క్రేజీ ఫీట్ తో శ్రీలీల.!

టాలీవుడ్ లో ఒక్కటి గాని ఓ హీరోయిన్ క్లిక్ అయితే వారి ఫేట్ ఏ లెవెల్లో ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫీట్ ని గడిచిన రెండేళ్లలో అయితే యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఆ తర్వాత శ్రీ లీల ఆ తర్వాత ఇప్పుడు అయితే సంయుక్త మీనన్ లు తమ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు.

ఇక ఇప్పుడు వీరిలో కృతి శెట్టి ఫేడ్ అవుట్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది. అనే నటించిన లాస్ట్ అన్ని చిత్రాలు కూడా భారీ డిజాస్టర్ లు అవుతున్నాయి. కానీ సంయుక్త మీనన్ మరియు శ్రీ లీల లు అయితే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నారు కానీ ఇప్పుడు శ్రీ లీల అయితే దాదాపు 10 ప్రాజెక్ట్స్ లో నటిస్తూ చాలా మార్జిన్ లో ఉంది.

అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అంశం ఏదైనా ఉంది అంటే శ్రీ లీల ఖాతాలో ఓ రేర్ అండ్ యూనిక్ రికార్డు పడినట్టుగా తెలుస్తుంది. ఇపుడు ఒక్క టాలీవుడ్ సినిమా దగ్గర ఇండియన్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా మొత్తం వరల్డ్ లో ఏ ఇండస్ట్రీ లో అయినా కూడా ఎక్కువ సినిమాలు హీరోయిన్ గా చేస్తున్న హీరోయిన్ గా ఒక్క శ్రీ లీల మాత్రమే నిలిచిందట.

కేవలం నటిస్తున్న సినిమాలు కాకుండా హీరోయిన్ గా అయితే ఇప్పుడు వరల్డ్ లోనే ఏ ఇండస్ట్రీ లో కూడా ఏ హీరోయిన్ ఇప్పుడు శ్రీ లీల చేస్తున్నన్ని సినిమాలు చెయ్యట్లేదు అని తెలుస్తుంది. దీనితో ఈమె వరల్డ్ లోనే బిజీ హీరోయిన్ గా ఇప్పుడు నిలిచినట్టుగా రీసెంట్ గా సినీ వర్గాల్లో తెలిసింది. మొత్తానికి అయితే ఇప్పుడు శ్రీ లీల పీక్ కెరీర్ లో ఉంది.