Kubera : కమ్ముల కుబేర.. ధనుష్ అప్సెట్?

టాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌ చిత్రం కుబేరా ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అనేక కారణాల వల్ల వాయిదా పడుతుండగా, తాజాగా మరో చిక్కు బృందాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. రష్మిక మందన్న వర్కౌట్ చేస్తూ గాయపడటంతో, ఆమె షూటింగ్‌లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. వైద్యుల సూచన మేరకు ఆమె కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో, ఆమె పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ నిలిచిపోయింది.

ఇప్పటికే ఈ సినిమా విడుదలకు అనేక వాయిదాలు పడటంతో, ధనుష్ సహనం కోల్పోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల, లైనప్‌లో ఉన్న ఇతర ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. నిర్మాతలు ఎలాగైనా ఈ సమస్యలను అధిగమించి సినిమాను స్పీడ్ గా ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, రష్మిక కోలుకోవడానికి కనీసం నెలరోజులు పడుతుందనే సమాచారం మరోసారి ఆలస్యం దిశగా మళ్లింది.

శేఖర్ కమ్ముల తన స్టైల్‌కు తగ్గట్టుగా ఓ భారీ సినిమాను తెరకెక్కించాలని ఎంతగానో శ్రమిస్తున్నప్పటికీ, అనుకోని సమస్యలు టీమ్‌ను కాస్త హై టెన్షన్‌కి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదలను వేసవి కోసం అనుకున్నారు. కానీ తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఆ సమయానికి రిలీజ్ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు, రష్మిక పాత్రకి సంబంధించిన ముఖ్యమైన పాటలు, ఫైట్ సీన్స్ ఇంకా మిగిలి ఉండటం టీమ్‌ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

విడుదల వాయిదాలు పడ్డా, అభిమానులు మాత్రం కుబేరా సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్, నాగచైతన్య, రష్మికల కాంబినేషన్‌ పై భారీ హైప్ నెలకొనగా, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరి, కుబేరా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి!

దిల్ రాజుకు పెద్ద బొక్క || Director Geetha Krishna About IT Raids on Dil Raju House || Telugu Rajyam