ముగ్గురు అక్కచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక హీరో ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఆగ్ర హీరోల తమ్ముళ్లు కొడుకులు ఇండస్ట్రీలో నట వారసులుగా కొనసాగడం సర్వసాధారణం. హీరోయిన్స్ కూడా చాలామంది ఇలానే ఇండస్ట్రీలో నట వారసత్వంగా పరిచయమై అగ్ర హీరోయిన్స్ గా కొనసాగి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పటి స్టార్ బ్యూటీ హీరోయిన్ నగ్మా ఇండస్ట్రీలో పరిచయమైన స్వల్ప కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ రోజుల్లో నగ్మా సినిమా విడుదలవుతోందంటే థియేటర్ల వద్ద ఆమె అభిమానులు సందడి చేసేవారు. హీరోయిన్ నగ్మా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని పొందింది.

హీరోయిన్ నగ్మా నట వారసత్వంగా ఇండస్ట్రీలో పరిచయమైన ఆమె చెల్లెలు జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జ్యోతిక వైవిధ్యమైన పాత్రల్లో ఎక్కువగా నటించి తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ్, కన్నడ ,మలయాళీ భాషల్లో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలు నటించి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొంతకాలం తన హవాను కొనసాగించింది. బ్యూటీ హీరోయిన్ నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా చాలా సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

అయితే ఈ ముగ్గురు అక్క చెల్లెలు హీరోయిన్స్ గా చాలా సినిమాల్లో నటించినప్పటికీ వీరందరితో కలిసి చేసిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ ముగ్గురు హీరోయిన్స్ తో సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి,నగ్మా కలిసి నటించిన సినిమాలు ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు ఈ మూడు సినిమాలు అప్పట్లో ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, జ్యోతికతో కలిసిన నటించిన సినిమా ఠాగూర్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే మాస్టర్ సినిమాలో చిరంజీవితో కలిసి రోసిని నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ రకంగా ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పొచ్చు.