Heroin Lakshmi: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన ఓకే కుటుంబం సినిమా ద్వారా మొదటగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు హీరోయిన్ లక్ష్మి. ఈ సినిమా తరువాత మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో బంగారు మనిషి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గారికి తనకి ఒక సంఘటన జరిగిందని ఆ సంఘటన ఇప్పటికీ తనకు బాగా గుర్తు ఉందని నటి లక్ష్మి ఒక సందర్భంలో వెల్లడించారు ఎన్టీఆర్ గారు షూటింగ్లో ఉన్నారు అంటే ఆయనకు భోజనం అల్పాహారం అన్ని ఇంటి నుంచి వస్తాయి.
ఇలా ఒకరోజు లొకేషన్లో ఉన్న సమయంలో అతనికి ఇంటినుంచి అల్పాహారంగా రెండు పోళీలు, రెండు దోసెలు, హల్వా, రెండు యాపిల్ జ్యూస్ సీసాలు, కారప్పూస వంటివి వచ్చాయి. ఇక ఆయనతో పాటు కలిసి తాను కూడా ఫలహారం చేశానని అయితే సగం దోశతిని లేచి వెళ్లిపోతున్న సమయంలో ఎన్టీఆర్ గారు ఏవండీ లక్ష్మి గారు అంటూ ఎంతో మర్యాదగా పిలిచారని తెలిపారు. ఎన్టీఆర్ గారు అలా పిలవగానే దగ్గరకు వెళ్లాను అప్పుడు తను ఏం తిన్నా జీర్ణించుకునే వయసు మీది అలాంటి వయసులో కేవలం సగం దోసే తింటారా? సిగ్గు లేదా మీకు? అని అన్నారు.
ఎన్టీఆర్ గారు అలా అనేసరికి ఏంటండీ మర్యాదగా పిలిచి ఇలా తిడుతున్నారు అంటూ సరదాగా అన్నానని, ఆ సమయంలో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ..లేకపోతే ఏంటండీ ఇంత చిన్న వయసులో మీరు బాగా తిని మంచిగా వ్యాయామాలు చేస్తూ మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు అంటూ తనకు సలహా ఇచ్చారని ఓ సందర్భంలో నటి లక్ష్మి బంగారు మనిషి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాన్ని వెల్లడించారు.