Vishwak sen : సక్సెస్ తో సంబందం లేకుండా వరుస ఆఫర్స్ తో దూసుకు పోతున్న పాగల్ హీరో …!

Vishwak Sen: విశ్వక్ సేన్ టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. వెళ్ళిపోమాకే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. వెళ్ళిపోమాకే సినిమా తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది ఈ సినిమాతో యువతరాన్ని బాగా ఆకట్టుకున్నాడు. తర్వాత వెంటనే  ‘ఫలక్ నుమా దాస్’  ఈ సినిమాతో కూడా బాగా సక్సెస్ అయ్యాడు. ‘ఫలక్ నుమా దాస్’  సినిమాను తానే సొంతంగా దర్శకత్వం కూడా వహించాడు. అంతేకాకుండా ఈ సినిమాకి హైప్ క్రియేట్ చేయడంలో కూడా తనదైన స్టైల్ చూపించాడు. ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయిన కూడా మంచి కలెక్షన్లను సాధించింది. తర్వాత వచ్చిన హిట్ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

విశ్వక్ సేన్ ప్రవర్తన వల్ల కొద్దిగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న, కెరీర్లో మరి చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా కూడా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.విశ్వక్ సేన్ తనదైన శైలిలో సైలెంట్ గానే సినిమాలు చేస్తూ పోతున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా ‘ముఖచిత్రం’ అనే టీజర్ వచ్చింది.దీంతోపాటు అతడు నటిస్తోన్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’ సినిమాల పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు.

వీటితో పాటు ‘గామి’ అనే సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇవి కాకుండా ‘దమ్కీ’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ‘ఫలక్ నుమా దాస్ 2’, ‘స్టూడెంట్’ అనే కొత్త సినిమాల్లో కూడా నటించబోతున్నట్లు ఇటీవల విశ్వక్ సేన్ వెల్లడించాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో సినిమాలు లైన్ లో పెట్టిన ఘనత మాత్రం విశ్వక్సేన కే దక్కుతుంది.