Hero Venkat: షూటింగ్ లో ప్రమాదం కారణంగా మూడు నెలలు బెడ్ మీద ఉన్న హీరో…!

Hero Venkat: తన మొదటి సినిమాతోనే విజయాన్ని దక్కించుకున్న హీరో వెంకట్. ఈ సినిమా తరువాత చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని సినిమాల్లో మాత్రం హీరోగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. కానీ హీరో వెంకట్ కి ఇండస్ట్రీలో హీరోగా అనుకున్నంత పేరు రాలేదు. అన్నయ్య సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా నటించి హీరో వెంకట్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాల తరువాత హీరో వెంకట్ ఎక్కువగా ఏ సినిమాల్లోనూ కనిపించలేదు

ప్రస్తుతం హీరో వెంకట్ కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే హీరో వెంకట్ ఆలీతో సరదాగా షో లో గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించారు. కాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి వచ్చింది. ఈ షోలో హీరో వెంకట్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో వెంకట్ మాట్లాడుతూ తన మొదటి సినిమా సీతారాములు చూతమురారండి సినిమా హిట్ అయినప్పటికీ తనకు ఇమేజ్ ను క్రేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా చిరంజీవితో కలిసి నటించిన అన్నయ్య సినిమా అని చెప్పారు.

అయితే హీరో వెంకట్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ షో ద్వారా పంచుకున్నారు నటి విజయశాంతి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని తమ కంపెనీ కోసం మోడలింగ్ కూడా చేసింది అంటూ హీరో వెంకట్ తెలిపారు. అలాగే నటుడు బాలకృష్ణ గారి గురించి కూడా తనకున్న కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు.బాలయ్య గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన ఎంత ఎండ ఉన్నప్పటికీ ఎలాంటి కష్టం ఉన్నప్పటికీ షూటింగ్ ని చేసేవారని తెలిపారు.

ఇంకా చదువు గురించి చెప్తూ కాలేజ్ కి సరిగా వెళ్లే వాడిని కాదు అని తాను చెట్టు మీద పెట్టిన బుక్ దాదాపు ఐదేళ్లపాటు ఆ చెట్టు మీదనే ఉంది అంటూ నవ్వుతూ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇంకా నేను సింగిల్ గానే ఉన్నాను అని తెలిపారు. నేను ఏది తలుచుకున్నా దాన్ని సాధించగలను అని హీరో వెంకట్ తెలిపారు. అయితే తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వెంకట్ ఆ ఐదుగురు సినిమా లో షూటింగ్ చేస్తున్నప్పుడు తనకు ప్రమాదం జరిగిందని ముందుకు పడాల్సింది. బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోయానని దాంతో చాలా దెబ్బలు తగిలాయని దానివల్ల మూడు నెలలపాటు బెడ్ మీదనే విశ్రాంతి తీసుకున్నాను అని తన జ్ఞాపకాలను ఈ షో ద్వారా పంచుకున్నారు హీరో వెంకట్.