టాలీవుడ్ సినిమా దగ్గర 2000 దశకంలో యూత్ సినిమాల్లో అయితే ఓ రేంజ్ లో షైన్ అయ్యిన హీరోస్ లో యంగ్ హీరో తరుణ్ కూడా ఒకడు. మరి తరుణ్ హీరోగా నటించిన ఎన్నో చిత్రాలు సెన్సేషనల్ హిట్ లు ఇండస్ట్రీ హిట్ కూడా తనకి టాలీవుడ్ లో ఉంది. ఇక ఇప్పుడు అయితే టైం మారడంతో తన సినిమాలు కూడా తగ్గిపోయాయి.
అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో రానా, ప్రభాస్ ఇంకా కొందరు పేర్లు ఉన్నాయి కానీ వారిలో తరుణ్ కూడా ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఇప్పటికీ తరుణ్ పెళ్లి చేసుకోలేదు. అయితే లేటెస్ట్ గా తాను పెళ్లి చేసుకుంటుంన్నట్టుగా పలు వార్తలు సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా..
ఈ వార్తలపై తరుణ్ తన స్పందన అందించినట్టుగా తెలుస్తుంది. కాగా తరుణ్ అయితే ఈ వార్తలని పూర్తిగా ఖండించాడు. తాను ఇంకా పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను అని ఒకవేళ అలాంటి గ్గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే ఇలా కాదు నేనే స్వయంగా షేర్ చేస్తాను అని కన్ఫర్మ్ చేసాడు.
అలాగే తనపై ఎందుకు ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారో తెలియడం లేదు అని ఈ వార్తలు అన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పేసారు. దీనితో అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఇప్పుడు తరుణ్ అయితే తన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తుండగా సినిమాలకు ప్రస్తుతం దూరం గానే ఉన్నాడు.
పెళ్లి ప్రచారంపై తరుణ్ క్లారిటీ!
తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ… ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్… pic.twitter.com/hMkyP9MRdg
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 2, 2023