స్ట్రైట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య.. దర్శకుడు ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇకపోతే సూర్య నటించిన తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ తెలుగులో కూడా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య ఇప్పటివరకు ఒక స్ట్రైట్ సినిమా కూడా చేయలేదు.

గతంలో ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా తర్వాత బోయపాటి శ్రీను పేరు కూడా పరిగణలోకి వచ్చింది. అయినా ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. ఇకపోతే తాజాగా సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించబోతున్నారని తెలుస్తోంది.

తెలుగులో గోపీచంద్ హీరోగా నటించిన శౌర్యం సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ తమిళంలో అజిత్ వంటి హీరోలతో వరుస హిట్ సినిమాలను తీస్తూ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో సూర్య పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని యూవీ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన తెలియజేయునన్నట్లు సమాచారం.