పెళ్లికి సిద్ధమైన మరో యువ హీరో

sumanth

 

లాక్ డౌన్ లో ఒక్కసారిగా యువ హీరోలు పెళ్లి న్యూస్ లతో కొంత వరకు సర్ ప్రైజ్ ఇచ్చారు. పెళ్లంటే కిలోమీటర్లు పరిగెత్తే వారు కూడా చాలా తొందరగానే పాట్నర్స్ తో హానిమూన్ కు వెళ్లారు. ఇక మొత్తానికి మరో యువ హీరో కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అతను మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ నిర్మాత యమ్ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్.

sumanth ashwin
తూనీగా తూనీగా సినిమాతో వెండితెరకు పరిచయమైన సుమంత్ కొన్ని ప్రేమ కథలతో డీసెంట్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హీరోల రేంజ్ లో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. డిఫరెంట్ గా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ ఈ హీరో పట్టు విడువని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా సుమంత్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

ఎమ్ఎస్.రాజు కుటుంబ సభ్యులకు సన్నిహితులైన దీపిక అనే అమ్మాయిని సుమంత్ కు ఇచ్చి వివాహం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లిని హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఈ నెల 13న నిర్వహించనున్నట్లు సమాచారం. కేవలం అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు టాక్. అలాగే కొందరు సినీ ప్రముఖులు సుమంత్ పెళ్లికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.