Gorre Puranam Movie: వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సుహాస్ (ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ’గొర్రె పురాణం’ బాబీ దర్శకుడు. సెప్టెంబర్ 20న ఈచిత్రం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఒక గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఒక గొర్రె వల్ల గొడవలు మొదలు కావడం.. దానిపై కేసు పెట్టడం వంటి అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హీరో సుహాస్.
సుహాస్ కొత్త సినిమా ‘గొర్రె పురాణం’
గత నెల ’ప్రసన్నవదనం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు సిద్దం చేశాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం గొర్రెపురాణం సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. ఫోకల్ సినిమాస్ బ్యానర్‌పై ప్రవీణ్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ట్రైలర్‌ను వదిలింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక గొర్రె చేసిన పని వలన రెండు మతాలకు చెందిన ప్రజలు గొడవపడుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
అయితే అసలు గొర్రెకు హిందు, ముస్లింలకు మధ్య గొడవ ఏంటి.. రెండు మతాలకు చెందిన ఆ ఊరి ప్రజలు అసలు గొర్రెను ఎందుకు చంపాలి అనుకుంటారు. సుహాస్ జైలులో ఎందుకు ఉంటాడు. గొర్రెకు సుహాస్‌కు సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా సినిమా చూడాల్సిందే.