శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్‌ కుటుంబం

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న శ్రీకాంత్‌ కుటుంబానికి.. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.