బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన హీరో సిద్దు జొన్నలగడ్డ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ సినిమాలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా… బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. గతంలో ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన బాలకృష్ణ ఆ షోలో పాల్గొన్న సెలబ్రెటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ వ్యక్తిగత విషయాలు రాబట్టడమే కాకుండా సరదాగా పంచులు సెటైర్లు వేస్తూ మొదటి సీజన్ సూపర్ హిట్ చేశాడు. దీంతో రెండవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

తాజాగా అన్ స్టాటబుల్ సీజన్ 2 కూడా ప్రారంభం అయింది. ఈ సీజన్ 2 లో మొదటి వారంలో మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అతని తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు. మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ తన బావ అల్లుడితో కలిసి ఏపీ రాజకీయాల గురించి చర్చించటమే కాకుండా వారి వ్యక్తిగత విషయాలను కూడా చర్చించి నవ్వులు పోయించాడు. ఇలా మొదటి ఎపిసోడ్ కి ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

ఇక ఈ సీజన్ టు రెండవ ఎపిసోడ్లో యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ యంగ్ హీరోలు ఇద్దరితో కూడా బాలకృష్ణ సరదాగా మాట్లాడుతూ సందడి చేశాడు. ఈ క్రమంలో అమ్మాయిల విషయం దగ్గర నుండి రాత్రి వేసే పెగ్గు వరకు అన్ని వ్యక్తిగత విషయాలను రాబట్టాడు. ఇలా ఒక సందర్భంలో జీవితమన్నాక బ్రేకప్ కామన్ సార్ అని సిద్దు అనగానే.. ఎన్ని బ్రేకప్ లు అయ్యయి అని బాలయ్య ప్రశ్నించాడు. దీంతో మనస్ఫూర్తిగా మూడు అయ్యాయి సార్ అంటూ సిద్దు సమాధానం చెప్పాడు. అంటే సినిమాకు ఒక గర్ల్ ఫ్రెండ్ మార్చవన్నమాట అంటూ బాలయ్య సెటైర్ వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ గురించి బాలకృష్ణ ఉంది యంగ్ హీరో ఓపెన్ అయ్యాడు.