శర్వానంద్‌ ‘మనమే’పై ఆశలెన్నో…!!

టాలీవుడ్‌ యువ కథానాయకుడు శర్వానంద్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్‌ ప్రారంభం నుంచే ‘గమ్యం’, ‘యువసేన’, ‘అమ్మ చెప్పింది’, ‘వెన్నెల’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. అయితే ఈ నటుడికి ఇప్పటికి తెలుగులో బిరుదు లేదన్న విషయం తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమా ఈవెంట్‌లో తన బిరుదును ప్రకటించారు మేకర్స్‌. శర్వానంద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మనమే’ .

ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్‌ 7న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర బృందం హైదరాబాద్‌లో ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్‌ దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌లతో పాటు తదితరులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.