పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో శర్వానంద్… వధువు హైదరాబాద్ అమ్మాయే?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఇంకా పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో హీరో శర్వానంద్ కూడా ఒకరు.ఇప్పటికే ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి గురించి ఆలోచించకుండా ఉన్నారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఎవరైనా ప్రశ్నిస్తే నాకన్నా ఇండస్ట్రీలో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అంటూ ప్రతిసారి తన పెళ్లి విషయం గురించి మాట దాటేస్తూ ఉన్నారు.

ఇకపోతే త్వరలోనే ఈయన పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. తాజాగా శర్వానంద్ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన హైదరాబాద్ కి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లి విషయం గురించి ఇరువురు కుటుంబ సభ్యులు పెళ్లి గురించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందినది అయితే ఈమె గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో తాను హైదరాబాదులోనే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ యువతితో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం.ఇక శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి పేరు ఏంటి తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.