రామ్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఖాయమేనట, కానీ ?

hero ram potineni gave clarity about trivikram movie

త్రివిక్రమ్ శ్రినీవాస్ సినిమా అంటే అభిమానులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటారు. వారి ఊహలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ కూడా సినిమాను తీర్చిదిద్దుతాడు. అయితే త్రివిక్రమ్ తన తొలిసినిమా ‘అ..ఆ’ తప్పితే మిగిలిన అన్ని సినిమాలు స్టార్ హీరోలతోనే తెరకెక్కించాడు. ప్రతి హీరోతో చేసిని సినిమాతో ఆయా హీరో అభిమానులను మెప్పించాడు. మహేష్‌తో రెండు సార్లు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌తో మూడు సార్లు సినిమాలు చేశాడు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన రెండో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. వీరి కాంబో అంటేనే అభిమానుల ఆనందానికి వ్యవధులు లేకుండా పోతున్నాయి. ఇదిలా ఉంటే మరో పక్క రాంపోతినేనితో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపించాయి.

hero ram potineni gave clarity about trivikram movie
hero ram potineni gave clarity about trivikram movie

గత ఏడాది రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. మళ్లీ ఇప్పుడు రెడ్ సినిమాతో మాస్ ఫాన్స్‌ ముందుకి వస్తున్నాడు. ఇందులో రెండు పాత్రల్లో రామ్ కనిపించనున్నాడు. అంతేకాకుండా వీటిలో ఒకటి పూర్తి మాస్ అయితే మరోకటి పూర్తి క్లాస్‌గా కనపించనున్నాయి. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ క్రమంలో రామ్ త్రివిక్రమ్ సినిమాపపై కామెంట్ చేశాడు. తమ ఇద్దరి కాంబోలో సినిమా తప్పక ఉంటుంది. ఇంతకుముందే దీనిపై చర్చించాం. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. దానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా రామ్ అన్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం పరిస్థితుల్లో వీరి కాంబో ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు బాగానే ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం కోసం వేచి చూడాలి.