Bhale Unnade: ఓటిటిలోకి వచ్చేసిన ‘భలే ఉన్నాడే’

Bhale Unnade Movie: ఇటీవల ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామి’ అంటూ వరుస చిత్రాలతో పలకరించిన రాజ్‌ తరుణ్‌ తాజాగా నటించిన ‘భలే ఉన్నాడే‘ సినిమా పక్షం రోజులకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ‘గీత సుబ్రహ్మణ్యం’ సిరీస్‌తో ట్రెండ్‌ సృష్టించిన దర్శకుడు శివ సాయి వర్ధన్‌ ఈ మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు.

Bhale Unnade Movie Review : ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్!

మనీషా కందుకూర్‌ హీరోయిన్‌గా నటించగా అభిరామి, హైపర్‌ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్‌, గోపరాజు రమణ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే.. రాధ (రాజ్‌తరుణ్‌) వైజాగ్‌లోని ఓ మధ్యతరగతి కుర్రాడు.శారీ డ్రేపర్‌ (ఫంక్షన్‌లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తి) పని చేస్తుంటాడు. తల్లి గౌరి( అభిరామి) బ్యాంక్‌ ఉద్యోగి. కృష్ణ (మనీషా కంద్కూరు) మోడ్రన్‌ గర్ల్‌. ప్రేమ, పెళ్లి విషయాల్లో కొన్ని ఆలోచనలతో ఉంటుంది.

రాధాకృష్ణల లవ్‌ స్టోరీ… ‘భలే ఉన్నాడే’

అయితే రాధను చూడకుండా, ఎవరో తెలియకుండానే శారీ డ్రేపర్‌గా ఉన్న పరిచయంతో రాధతో ప్రేమలో పడుతుంది. తర్వాత రాధ కూడా ప్రేమలో పడతాడు. ఓ సమయంలో కృష్ణ అవకాశమిచ్చినా రాధ హద్దు విూరకుండా పద్దతిగా ఉంటాడు. కొంత కాలానికి పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరూ పెళ్లికి సిద్థమై నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విషయం చెబుతుంది. దీంతో కృష్ణకు రాధ వ్యక్తిత్వంపై అనుమానం ఏర్పడి రాధ సంసారానికి పనికొస్తాడా లేదా అని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏమైంది. పీటల దాకా వచ్చిన పెళ్లి ఎందుకు ఆగింది అనేది మిగతా కథ.

Ys Jagan Tirumal Tour Public Reveals Shocking Truth | TirumalaLaddu | Chandrababu | PawanKalyan | TR