ప్రేక్షకుల ముందుకు ‘కల్కి’ స్పెషల్‌ బుజ్జి వెహికిల్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఇండియన్‌ మైథలాజికల్‌ కాన్సెప్ట్‌ తో వస్తున్న ఈ సినిమాలో ఇండియన్‌ దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీ రోల్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్‌. టీజర్స్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన బుజ్జి వీడియో అయితే నెక్ట్స్‌ లెవల్‌ అనే చెప్పాలి.

ఈ సినిమా కోసం బుజ్జి పేరుతో ఒక ఫ్యూచరిస్టిక్‌ కారు డిజైన్‌ చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ కారు సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారింది. చాలా స్టయిలిష్ గా ఉన్న ఈ కారు టాక్‌ ఆఫ్‌ ది ఇండియా గా మారింది.

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ కారు గురించే చర్చ నడుస్తోంది. అందుకే ఈ కారును ఆడియన్స్‌ వద్దకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. జూన్‌ 27న ‘కల్కి’ విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌ లో భాగంగా బుజ్జి కారును వాడనున్నారట మేకర్స్‌. ఇందులో భాగంగా.. భారతదేశంలోని కొన్ని నగరాలకు బుజ్జి ను తీసుకురానున్నారట. అంతేకాదు.. ఆడియన్స్‌ బుజ్జితో సెల్ఫీలు తీసుకునే అవకాశాన్ని కల్పించనున్నారట. ఆ సమయంలో బుజ్జితో ‘కల్కి’ టీమ్‌ కూడా ఉంటారని సమాచారం. దీంతో.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.