ప్రేమదేశం సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో అబ్బాస్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన అబ్బాస్ సెకండ్ హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు. అయితే ఈయనకు ఇండస్ట్రీలో క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై విదేశాలలో మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు.ఇలా ఈయన సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే అబ్బాస్ తాజాగా సోషల్ మీడియా వేదికగా హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఈ విధంగా అబ్బాస్ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు హీరో అబ్బాస్ కు ఏం జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఈయన ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన కుడి కాలిలోని లిగ్మెంట్ సమస్య కారణంగా తనకు వైద్యులు సర్జరీ నిర్వహించారని తెలియజేశారు. ఇలా తనకు సర్జరీ జరుగుతున్న సేపు తన మనసు ప్రశాంతంగా లేదని తనలో ఉన్న భయాన్ని అణచివేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
ఈ విధంగా కాలి లేగ్మెంట్ సమస్య కారణంగా సర్జరీ నిర్వహించిన అనంతరం తాను ఇంటికి చేరుకున్నానని అయితే తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన, ప్రార్థిస్తూ ఉన్నటువంటి అభిమానులకు ఈయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం తాను నడవలేని పరిస్థితిలో ఉన్నానని త్వరలోనే తిరిగి మామూలు స్థితికి చేరుకుంటానని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. ఇక ఈయన కాలికి సర్జరీ జరిగిందని తెలియగానే అభిమానులు ఈయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం అబ్బాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.