“సలార్ 2” ఉందా లేదా? క్లారిటీ మీకోసం

రీసెంట్ గా ఫ్యాన్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” హీరో ప్రభాస్ కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచింది. అయితే తెలుగు స్టేట్స్ వరకు ఓకే కానీ మిగతా చోట్ల ఈ సినిమాకి ఇంకా చాలా రావాల్సి ఉంది. అలాగే సలార్ సీజ్ ఫైర్ తర్వాత మేకర్స్ రెండో పార్ట్ కూడా ఉన్నట్టు ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు.

కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 ఉంటుందో లేదో అనేది డిసైడ్ అవుతుంది అని రిలీజ్ కి ముందే కన్ఫర్మ్ చేసాడు. అయితే ఇప్పుడు సలార్ 2 పై ఓ క్లారిటీ రానుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్ 1 రిజల్ట్స్ తో హ్యాపీ గానే ఉన్నాడట దీనితో పార్ట్ 2 ని తప్పకుండ రిలీజ్ చేస్తాడని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఇంకా మేకర్స్ సలార్ 2 ని “సలార్ శౌర్యంగ పర్వం” గా రివీల్ చేశారు. చాలా మంది అయితే పార్ట్ 2 కోసం కూడా బాగానే ఎగ్జైటింగ్ గానే ఉన్నారు కానీ గతంలో వచ్చిన సీక్వెల్స్ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల రేంజ్ లో ఆసక్తిగా లేరు అయినా కూడా పార్ట్ 2 ని మేకర్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మెయిన్ గా తెలుగు మార్కెట్ లో సలార్ పెద్ద హిట్ అయ్యింది కాబట్టి కేవలం కొన్ని భాషల్లో మాత్రమే పరిమితం చేస్తారో లేదో అనేది చూడాలి. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ నటుడు పృథ్వీ రాజ్ అలాగే జగపతి బాబు పాత్రలు ఎలా ఉంటాయి అనేది మరింత సస్పెన్స్ గా మారింది. వీటి సమాధానాలు కోసం కూడా ఎదురు చూస్తున్నారు.