అక్కడ నుంచి “ఆదిపురుష్” రిపోర్ట్స్ ఇవే.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఆదిపురుష్” అని అందరికీ తెలిసిందే. కాగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ లెవెల్లో ఈ జూన్ 16న రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా విజువల్ ట్రీట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ చిత్రం కి అయితే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ రిపోర్ట్స్ అయితే ఇపుడు నార్త్ సినీ ట్రాకర్స్ నుంచి వినిపిస్తున్నాయి. అక్కడి సినీ వర్గాల కొన్ని ట్రస్టడ్ వర్గాలు చెప్తున్నా దాని ప్రకారం ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది అని భారీ యాక్షన్ సీక్వెన్స్ లు విజువల్స్ సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా వచ్చినట్టుగా చెప్తున్నారు.

ఇలా మొత్తంగా అయితే ఆదిపురుష్ ఒక పైసా వసూల్ ఎంటర్టైనర్ అని బి టౌన్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆదిపురుష్ ఫలితంపై మరింత నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఫైనల్ గా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టనున్నట్టుగా వారు చెప్తున్నారు.

ఇక ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కించగా కృతి సనన్ సీతగా రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ సన్నీ సింగ్ లక్ష్మణ్ పాత్రల్లో నటించారు. అలాగే అజయ్ మరియు అతుల్ లు సినిమాకి అదిరే మ్యూజిక్ ని అందించారు.