ఈ ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలిపోయిన లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్”. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం అయితే దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఈ సినిమాతోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు.
అయితే ఈ సినిమా టీజర్ తో వచ్చిన నెగిటివ్ టాక్ నెక్స్ట్ ట్రైలర్ తో మేకర్స్ లేపేశారు. అలా థియేట్రికల్ రిలీజ్ వరకు కూడా సెన్సేషనల్ హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రం తీరా రిలీజ్ అయ్యాక సినిమాలో సరైన కంటెంట్ లేదని తేలిపోయింది. దీనితో వసూళ్లు నాలుగో రోజు నుంచే దారుణంగా పడిపోగా భారీ నష్టాలు తప్పవని అంతా అనుకున్నారు.
అయితే హిందీలో ఓన్ రిలీజ్ కాబట్టి పర్వాలేదు కానీ తెలుగు వెర్షన్ లో మాత్రం భారీ నష్టాలు తప్పలేదు. ఇక ఆదిపురుష్ లైఫ్ టైం వసూళ్లపై అయితే బాలీవుడ్ కి చెందిన సంచలన క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ పోస్ట్ చేసాడు. ఆదిపురుష్ చిత్రం వరల్డ్ వైడ్ 315 కోట్ల గ్రాస్ ని అందుకోగా.
అందులో 175 కోట్లు తెలుగు వెర్షన్ సహా సౌత్ వెర్షన్ నుంచి హిందీ నుంచి 140 కోట్లు రాబట్టింది అని అందులో 150 కోట్ల షేర్ మొత్తం వచ్చింది అని తెలిపాడు. అలాగే ఈ రేంజ్ నంబర్స్ ఈ టాక్ తో ఏ బాలీవుడ్ హీరో కూడా అందుకోలేదని ప్రభాస్ ని పొగిడేసాడు. దీనితో ఈ ట్వీట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.
Film #ADIPURUSH net lifetime business in India.
Hindi- ₹140Cr
Entire South- ₹175Cr
Total- ₹315Cr! Producer share is ₹150Cr!
And this business is after so much negativity. No bollywood actor’s film can do this much business except @iamsrk! @PrabhasRaju!— KRK (@kamaalrkhan) July 1, 2023