అల్లు అర్జున్ కి అస్వస్థత..!

టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో సొంతంగా క్రేజ్ ని ఏర్పర్చుకున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సందేహం లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ నటించిన పుష్ప తో తన పాన్ ఇండియా క్రేజ్ అండ్ మార్కెట్ ని ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 ని ఇప్పుడు చేస్తున్నాడు.

ఇంకా ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సాలిడ్ సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ తన ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడుతున్నాడు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఈ షూట్ తో ఈ మధ్య కాస్త అస్వస్థతకి లోనయ్యాడని తెలుస్తుంది.

రీసెంట్ గా స్టార్ట్ చేసిన మాసివ్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ కొంచెం భారీ కాస్ట్యూమ్ లు ఏక్షన్ పార్ట్ చేయడంతో తనకి కొన్నాళ్ల నుంచి వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడని సినీ వర్గాల్లో బన్నీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయినా కూడా బన్నీ అయితే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడట.

దీనితో అల్లు అర్జున్ డెడికేషన్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15న పాన్ వరల్డ్ లెవెల్లో భారీ స్థాయిలో అయితే రిలీజ్ కాబోతుంది.