మళ్ళీ అదే రోల్ లో పవన్ కళ్యాణ్…ఈ సారైనా సక్సెస్ కొడతాడా?

రాజకీయాల కోసం కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు. ఈ సినిమాలు మరీ సూపర్ హిట్స్ కాకపోయినా, మంచి టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే సుజీత్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇందులో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఇంతకముందు పవన్ కళ్యాణ్ ‘బాలు’, ‘పంజా’ సినిమాల్లో కూడా మాఫియా నాయకుడిగా నటించాడు కానీ ఆ రెండు సినిమాలు డిసాస్టర్ అయ్యాయి. మరి ఈ సారైనా పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదో చూడాలి.

డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..ఒక వీరాభిమాని తన అభిమాన హీరో తో సినిమా చేస్తే గబ్బర్ సింగ్ వచ్చింది..ఇప్పుడు కూడా సుజీత్ అలాంటి సినిమానే పవన్ కళ్యాణ్ కి అందిస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.